జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం రెడీ అయిపోయాడు.తాజాగా ఎన్టీఆర్ మరియు  కొరటాల శివ కాంబినేషన్ లో  ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.అయితే  రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఇకపోతే ఆ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపుగా..

 నాలుగు సంవత్సరాల పాటు సమయం ను కేటాయించాడు. అయితే ఎన్టీఆర్ మరియు కొరటాల ల కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన వార్తలు గత ఏడాది కాలంగా వస్తూనే ఉన్నాయి.ఇదిలావుండగా తాజాగా ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో కొరటాల శివ మాట్లాడుతూ.. ఇక త్వరలోనే ఎన్టీఆర్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాబోతుందని , జులై లో సెట్స్ పైకి రాబోతుందని శివ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అయితే  ఆచార్య సినిమా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో చేసే అవకాశం ఉంది.ఇకపోతే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో మూవీ కేవలం మూడు నెలల్లోనే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.అయితే  మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్టీఆర్ 30 సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇకపోతే  ఈ చిత్రాన్ని సుధాకర్ మరియు కళ్యాణ్ రామ్ లు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.ఈ సినిమాకు సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ ను నిర్మాతలు కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: