ఇటీవల విడుదల అయ్యి భారీ ఘన విజయాన్ని అందుకున్న సరిలెరు నీకెవ్వరు సినిమా తర్వతగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట సినిమా తో ప్రెక్షకుల ముందుకు రానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.. ముఖ్యంగా ఈ సినిమా నుంచి మొన్నీమధ్య విడుదల అయిన కలావతి సాంగ్ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..
పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ పాటలో మహేష్ మాస్ అవతారంలో కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. పూర్తి మాస్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటలో మహేష్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటాడని అందరు భావిస్తున్నారు..పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా, థమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని రూపొందిస్తున్నారు.కీర్తి సురేష్ మహేష్ కు జోడిగా నటిస్తుంది..మే 12న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.