వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు మహేష్ బాబు. మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న ఈ హీరో ఇప్పుడు మరొక మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఓ వర్గం మాత్రం మహేష్ చేసిన ఈ సినిమాల పట్ల ఏ మాత్రం సంతోషంగా లేదనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతకుమించిన బ్లాక్ బస్టర్ హిట్ ను వారు ఆశిస్తూ ఉండడంతో మహేష్ బాబు పై ఇప్పుడు ఒక పెద్ద హిట్ ఇవ్వాల్సిన ఒత్తిడి బాగా ఉంది.

చాలా కాలంగా ఒకే రకమైన సినిమాలను ఒకే తరహా పాత్రలు చేస్తూ అందరినీ బోరు కొట్టిస్తున్నాడు మహేష్ అని వారు చెప్పే మాట. అందుకే ఇప్పుడు చేయబోయే సర్కారు వారి పాట సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందని అందరూ భావిస్తున్నారు.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. హీరో పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కూడా మహేష్ పూర్తి చేశాడు.

వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ విధంగా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అందరూ ఊహించిన విధంగా ఈ సినిమా కేవలం మాస్ సినిమా కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పోస్టర్స్ మరియు టీజర్ బట్టి చూస్తుంటే మహేష్ ఎంతో స్టైలిష్ గా మునుపెన్నడూ లేని విధంగా కనిపించబోతున్నారు అనేది నిజమే అయినా కూడా ఇందులో అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథ ఉంటుందని ఇప్పుడు కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం తెలుస్తుంది.  కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుందట. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అలాగే వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: