టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ కలక్షన్స్ కు చిరునామా మెగా ఫ్యామిలీ హీరోలు. చిరంజీవి పవన్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాల కలక్షన్స్ అనేక సందర్భాలలో గతంలో రికార్డులు క్రియేట్ చేసాయి. దీనితో ఈ మెగా హీరోలకు పారితోషికం 50కోట్లు ఇస్తూ లాభాలలో కూడ షేర్ ను ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా ఆధిపత్యమే కనిపిస్తోంది.
గత సంవత్సరం పవన్ రీ ఎంట్రీ మూవీగా విడుదలైన ‘వకీల్ సాబ్’ ఈసంవత్సరం అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘భీమ్లా నాయక్’ సినిమాలకు మెగా అభిమానులు నీరాజనాలు పట్టారు. ఈరెండు సినిమాలకు విమర్శకుల నుండి మంచి రేటింగ్స్ కూడ వచ్చాయి. అయితే ఈరెండు సినిమాలకు వచ్చిన టోటల్ కలక్షన్స్ ను కేవలం వారంరోజుల లోపే ‘కేజీ ఎఫ్ 2’ అధిగ మిస్తోంది అని వస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
అల్లు అర్జున్ కెరియర్ బెస్ట్ హిట్ గా ప్రచారంలోకి వచ్చిన ‘పుష్ప’ రికార్డులు కూడ ‘కేజీ ఎఫ్ 2’ త్వరలో బ్రేక్ చేస్తుంది అన్నఅంచనాలు వస్తున్నాయి. ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ విషయానికి వస్తే ఈసినిమా తెలుగు రాష్ట్రాలలో కలక్షన్స్ పరంగా సృష్టించిన సునామి లెక్కల పై రకరకాల భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకులకు ఏమాత్రం అంతగా పరిచయం లేని కన్నడ హీరో యష్ తన ‘కేజీ ఎఫ్ 2’ ద్వారా సృష్టిస్తున్న రికార్డులు మెగా ఫ్యామిలీ టాప్ హీరోలకు కొత్త టార్గెట్ లు ఇస్తోంది అన్నసంకేతాలు వస్తున్నాయి.
ఈనెలాఖరున విడుదలకాబోతున్న ‘ఆచార్య’ కలక్షన్స్ రికార్డులు ఒక సునామీగా రికార్డులు క్రియేట్ చేయలేకపోతే ఒక కన్నడ హీరో యష్ ముందు టోటల్ మెగా ఫ్యామిలీ హీరోలు నిలబడలేకపోయారు అన్నకామెంట్స్ వచ్చే ఆస్కారం ఉంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఈకామెంట్స్ చిరంజీవి వరకు చేరడం వలన కాబోలు ఈవీకెండ్ లో జరగబోతున్న ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవితో పాటు పవన్ ను కూడ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి తమ మెగా పవర్ తో యష్ కు చెక్ పెట్టే అవకాశం ఉంది అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు..