ప్రస్తుతం కొరటాల శివ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు.  మెగాస్టార్ చిరంజీవి,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నక్సలైట్ లుగా కనిపించబోతున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇప్పటికే మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఆచార్య చిత్రం విడుదల చేసిన 'భలే భలే బంజారా'  సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.  ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి వేసిన స్టెప్పులకు మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఆచార్య చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఆచార్య మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్ లో భాగంగా  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ 'ఆచార్య'  సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... ఆచార్య సినిమా అదిరిపోయే విజువల్ ట్రీట్ లా ఉంటుంది అని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: