దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఇటీవల విడుదల అయింది. ఈ సినిమాలో రా ఏంజెట్‌గా విజయ్ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో దళపతి ఒక రా ఏజెంట్. ఒక మిషన్‌లో ఉన్నప్పుడు మాఫియా డాన్‌ను చంపే క్రమంలో ఒక చిన్నపాప ప్రాణం పోతుంది. అది తెలిసిన విజయ్.. తన వృత్తి నుంచి బయటకు వచ్చేసి బతుకుతుంటాడు. అలా హీరోయిన్ పూజా హెగ్డేతో పరిచయం అవ్వడం.. సెక్యూరిటీ ఉద్యోగం కోసం షాపింగ్ మాల్‌లో వెళ్లడం.. టెర్రరిస్టులు ఆ మాల్‌ను హైజాక్ చేయడం జరుగుతుంది. టెర్రరిస్టుల నుంచి మాల్‌లో ఉన్న ప్రజలను ఎలా కాపాడుతాడనే ‘బీస్ట్’ స్టోరీ.
బీస్ట్ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. సినిమా మంచి హిట్ అందుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బీస్ట్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా బీస్ట్ సినిమాకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. అలాగే ఈ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘అరబిక్ కుతూ’ సెన్సేషనల్ అయింది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీలు షార్ట్ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రీ క్రియేట్ చేశాడు టాంజానియా కుర్రాడు. అతని పేరు కిలీ పాల్. ఇతడు గతంలోను సౌత్ ఇండియన్ సాంగ్స్ పై డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బీస్ట్ సినిమాకు సంబంధించి ట్రైలర్ రీ క్రియేట్ చేయడంతో.. మళ్లీ వైరల్ అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసిన ఈ వీడియోని చూసి.. ఇటు దళపతి ఫ్యాన్స్, కిలీపాల్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియో వన్ మిలియన్ వ్యూస్స్ దాటేసింది.