
మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ లోని 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన క్యూట్ పెర్ఫామెన్స్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ తో మహేష్ అభిమానులకు ఇంత చిన్న వయసు నుండే క్రేజీ డాల్ గా మారింది.ఈమధ్య నమ్రత ఒక బాలీవుడ్ మీడియా హౌస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత తన కూతురు సితార పై కొన్ని కామెంట్స్ చేసింది.
సితార విషయంలో తనకు మహేష్ కు ఎలాంటి భయాలు లేవని ఆమె ఇష్టపడే పనిలో ప్రోత్సహిస్తామని చెపుతూ ఇప్పుడు సితారకు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఆ వయస్సులో పిల్లలకు సరైన గైడైన్స్ అవసరమని తన అభిప్రాయం అని నమ్రత భావిస్తోంది. అంతేకాదు సితార కు సరైన సమయంలో సరైన పనులు చేసేలా ఆమెకు మార్గనిర్దేశం చేయడం కోసం తాను మహేష్ సితారకు ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటామని సితార తన పరిమితుల్లో ఏమి చేయాలి ఏమి చేయకూడదనే విషయాల్లో క్లారిటీ ఇస్తున్న విషయాన్ని తెలియ చేసింది.
అయితే గౌతమ్ సితార మనస్తత్వానికి భిన్నంగా ఉంటాడనీ సినిమాల పట్ల సితారకు ఉన్నంత ఇష్టం ప్రస్తుతానికి గౌతమ్ కు లేదనీ అయితే భవిష్యత్ లో తమ పిల్లలు ఏరంగంలో రాణిస్తారో తమకు క్లారిటీ లేదు అంటూ వారు ఎలా కోరుకుంటే ఆ రంగంలో వారని ప్రోత్సహించదానికి తాము సిద్ధం అన్న క్లారిటీ ఇస్తోంది నమ్రత..