దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల విషయంలో ఏ భారతీయ సినిమాకు రాని విధంగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలోని పాటలు, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమాకు సంబంధించి పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లతోపాటు విదేశాల్లో ఉండే సోషల్ స్టార్లు కూడా స్పూఫ్‌లు, రీల్స్ చేస్తున్నారు. వీటికి కూడా భారీగానే స్పందన వస్తోంది.
తాజాగా జపాన్‌కు చెందిన ‘హీరోమునియేరు’ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ‘ఎత్తర జెండా’ సాంగ్‌పై వీడియో చేశారు. హీరోమునియేరు ఇప్పటికే టాలీవుడ్‌కు సంబంధించిన కవర్ సాంగ్స్, ఫన్నీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే ‘ఎత్తర జెండా’ సాంగ్‌లో తన ఫ్యామిలీతో చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కనిపించే ముగ్గురు అన్నా చెల్లెలు. వీరికి మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు. అందుకే వీరు చేసిన చాలా వరకు వీడియోల్లో ఎన్టీఆర్ పాటలే కనిపిస్తాయి.
గతంలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలోని ‘చీమ.. చీమ..’ సాంగ్ నుంచి, లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట వరకు అన్ని స్పూప్ వీడియోలు చేశారు. ఈ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాజాగా ఇదే సినిమాలోని ‘ఎత్తర జెండా’ పాటకు స్పూప్ చేశారు. ఎత్తర జెండా సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ఎలాంటి దుస్తులు ధరించారో.. సేమ్ అలాంటిదే హీరోమునియేరు టీమ్ ధరించింది. ఆ పాటలో ఎలాంటి స్టెప్పులు వేశారో.. సేమ్ అలాగే అచ్చుగుద్దినట్లు డ్యాన్స్ చేశారు. వీడియోలో కనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా వదల్లేదు. దీంతో వీరి క్రియేటివిటిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు హీరోమునియేరు టీమ్ చేసిన కొన్ని కవర్ సాంగ్స్ స్పూప్ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో మీరే చూడండి.