కెజీఎఫ్ సినిమా తో హీరో యష్ అన్నీ ఇండస్ట్రీ లో మంచి పేరును అందుకున్నాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇటీవల కెజీఎఫ్ 2సినిమా విడుదల అయ్యి కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది.హీరో నటన పై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.రాఖీభాయ్ గా అతని నటన బాగుందని సినీ ప్రముఖులు అభినందించారు..ఈ మేరకు తెలుగు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో యష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..


రాఖీభాయ్‌గా యశ్‌ చేసిన నటనను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా అని రామ్‌చరణ్‌ అన్నారు. యశ్‌ నటించిన 'కేజీయఫ్‌2' ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని అందుకున్నాడు.రామ్ చరణ్ కూడా హీరో పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.తాజాగా రామ్‌చరణ్‌ హీరో యశపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయనొక పోస్ట్ చేశారు. 'కేజీయఫ్‌2 సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు సోదరడు ప్రశాంత్‌ నీల్‌కు, అతని టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.సినిమాలో నటించిన అందరికి ఈ సినిమా ది బెస్ట్ అని పోస్ట్ లో రాసుకొచ్చాడు.


ఇకపోతే..ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు రామ్ చరణ్..శనివారం సికింద్రాబాద్‌ - పరేడ్‌ గ్రౌండ్‌లో డిఫెన్స్‌ అధికారులు నిర్వహించిన యుద్థవీరుల నివాళుల కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ..ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకోవడం, దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం అని చరణ్ అన్నారు.మనం ఇప్పుడు హాయిగా నిద్ర పొతున్నాము ఎందరో వీరుల త్యాగ ఫలం అని చెప్పాలి..వారిని స్మరిస్తూ ఈరోజు ఇలా జరపడం మన అదృష్టం..వారి త్యాగాలను ఎప్పుడూ మరచి పోవద్దు అని చరణ్ అన్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: