తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఐకాన్ గా అందరితో ప్రశంసలు అందుకుంటున్న రాజమౌళి సినిమాలలో నటించే అవకాశం గురించి టాప్ హీరోలు అంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. అయితే అలాంటి దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలలో నటించిన హీరోలకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. రాజమౌళి మూవీలలో నటించి బ్లాక్ బష్టర్ హిట్స్ అందుకున్న జూనియర్ చరణ్ ప్రభాస్ నాని లకు ఆతరువాత వారు నటించిన సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్స్.


అందువల్లనే రాజమౌళి దర్శకత్వంలో నటించి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నప్పటికీ టాప్ హీరోలు తాము నటించిన తదుపరి సినిమా విడుదల అవుతున్నప్పుడు తెగ టెన్షన్ పడతారు. ఈ నెగిటివ్ సెంటిమెంట్ చిరంజీవి దృష్టి వరకు వచ్చినట్లు ఉంది. అందుకే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి తనకు తాను సందర్భం క్రియేట్ చేసుకుని రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు వారు నటించే తదుపరి సినిమాలు ఫ్లాప్ అవుతాయి అని అనుకోవడం అవివేకం అనీ ఆ సినిమాలలో సరైన సబ్జెక్ట్ లేక అవి ఫ్లాప్ అయి ఉంటాయి కానీ రాజమౌళికి ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్ అంటకట్టడం తగదు అంటూ కామెంట్ చేసాడు.


దీనితో మెగా స్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడ రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ గురించి ఆలోచిస్తున్నారా అంటూ ఆ మూవీ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది ఆశ్చర్యపోయినట్లు టాక్. వాస్తవానికి ‘ఆచార్య’ మూవీ ‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ కంటే తెలుగు రాష్ట్రాలలో తక్కువ కలెక్ట్ చేస్తే ఒకవిధంగా అది చిరంజీవికి అవమానం.


సాధారణంగా ఒక బ్లాక్ బష్టర్ మూవీ తరువాత విడుదలైన సినిమాలు ఎంతో బాగుంటే కాని బ్లాక్ బష్టర్ హిట్స్ కావు. దీనికితోడు ‘ఆచార్య’ కథ ఒక రొటీన్ స్టోరీ మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం చిరంజీవి చరణ్ లు కలిసి నటించిన మ్యానియాతో ఈమూవీని చూడటానికి సగటు ప్రేక్షకులు టివీ లను ఓటీటీ లను వదిలి పెట్టి ‘ఆచార్య’ బాట పట్టాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: