పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ జనగణమనని తెరకెక్కించడానికి చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. వైడ్‌ స్పాన్‌ ఉన్న ఈ కథని లార్జ్‌ స్కేల్‌లో తెరకెక్కించాలని కలలు కంటున్నాడు. ఇక మల్టీలింగ్వల్ 'లైగర్' పూర్తయిన వెంటనే, 'జెజిఎమ్' పేరుతో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశాడు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఆర్మీఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

సీరియస్‌ థ్రిల్లర్స్‌తో ఆడియన్స్‌ని మెప్పిస్తున్నాడు అడివి శేష్‌. కమర్షియల్ మూవీస్‌కి దూరంగా సినిమాలు చేస్తోన్న అడివి శేష్‌, ఇప్పుడు మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌తో 'మేజర్' తీశాడు. ముంబయి 26/11 దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని క్రిష్ణన్‌ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. మే 27న ఈ సినిమా విడుదలవుతోంది.  

హనూ రాఘవపూడి 'లై, పడి పడి లేచే మనసు' ఫ్లాపులతో కొంచెం స్లో అయ్యాడు. ఈ డిజాస్టర్స్‌ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని సైనికుడి ప్రేమకథాంశంతో 'సీతారామం-యుద్ధం రాసిన ప్రేమ' అనే సినిమా తీస్తున్నాడు. దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్ లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న కీ-రోల్‌ ప్లే చేస్తోంది.

మాస్ మూవీస్‌ ట్రై చేసినా, మాస్‌ హీరో కాలేకపోతోన్న వరుణ్ ధావన్, మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ఇండో-పాక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్లిపోతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో బసంతర్‌ ఘటనలో అమరుడైన అరుణ్ కేధార్‌పాల్‌ కథాంశంతో 'ఇక్కీస్' అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్‌ ఆర్యన్ ఇప్పటివరకు యాక్షన్‌ జానర్‌లో అడుగుపెట్టలేదు. 'పతి పత్నీ ఔర్ ఓ, లవ్‌ ఆజ్‌కల్' అంటూ అమ్మాయిలు, పువ్వుల చుట్టూనే తిరిగాడు. అయితే ఈ కథలు బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో పేటియాట్రిక్‌ స్టోరీస్‌లోకి వచ్చాడు కార్తీక్. రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా 'కెప్టెన్ ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలెట్‌ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా.

బాలీవుడ్‌లో ఈమధ్యకాలంలో ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలు మ్యాగ్జిమమ్‌ సూపర్ హిట్‌ అయ్యాయి.  సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో వచ్చిన 'ఉరి' సినిమాతో విక్కీ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఇక సిద్ధార్థ్‌ మల్హోత్రాకి 'షేర్‌షా' సినిమాతో సూపర్‌ స్టార్డమ్‌ వచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథాంశంతో వచ్చింది 'షేర్‌షా'.


బాక్సాఫీస్ దగ్గర ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంటుంది. ఒకసారి మాస్ సినిమాలకి భారీ వసూళ్లు వస్తే మరోసారి లవ్‌స్టోరీస్ అదరగొడుతుంటాయి. ఇక మిలిటరీ బ్యాక్‌ డ్రాప్‌ కథాంశాలు అయితే అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా కనిపిస్తుంటాయి. అందుకే ఫిల్మ్ మేకర్స్‌ చాలామంది సైనికుల కథని సేఫ్‌గేమ్‌గా చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: