
అయితే ఇప్పుడు పవన్ తన మనసు మార్చుకుని ఈసినిమా షూటింగ్ ప్రారంభించడంతో క్రిష్ తెరిపిన పడ్డాడు. ఈసినిమాను ఎట్టి పరిస్థితులలోను వేగంగా పూర్తి చేస్తానని పవన్ మాట ఇవ్వడమే కాకుండా సమ్మర్ ను కూడ లెక్కచేయకుండా మే జూన్ నెలలోని అన్నిరోజులు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లోనే ఉంటానని మాట ఇచ్చాడట.
అయితే పవన్ తరుచూ చనిపోయిన కవుల రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం చేసే కార్యక్రమం పెట్టుకోవడంతో తరుచు ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ వస్తోందట. దీనికితోడు ఈమూవీ షూటింగ్ మధ్యలోనే పవన్ మరో సినిమా మొదలుపెడతాడు అని వస్తున్న వార్తలు విని క్రిష్ తెగ టెన్షన్ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీని దసరా రేసులో విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నా ఆదిశలో పవన్ నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందో తెలియని పరిస్థితి అంటున్నారు.
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ విడుదల కేవలం సంక్రాంతికి మాత్రమే విడుదల అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి రేస్ లోకి తీసుకు వస్తే ఇప్పటికే అనేక భారీ సినిమాలు సంక్రాంతి రేస్ లో ఉన్న పరిస్థితులలో ఈసినిమా మార్కెట్ పై ప్రభావం చూపించే ఆస్కారం ఉందని క్రిష్ భయం అట. దీనితో ఈసినిమాను దసరాకు విడుదల చేయాలా లేదంటే సంక్రాంతికి విడుదల చేయాలా అన్న విషయమై ఎటూ తేల్చుకోలేక తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్..