కూల్ సినిమాలు చేసే దర్శకుడిగా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరుంది. ఆయన తొలి సినిమా చేసిన విధానం తోనే తన చిత్రాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిపోయింది. ఆ విధంగా అప్పటినుంచి ఆ విధమైన ఆ తరహా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇలాంటి సినిమాలతో కూడా విజయాలు సాధించి పాపులారిటీ అందుకోవచ్చా అనే విధంగా శేఖర్ కమ్ముల సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు. ఇప్పుడు ఆయనతో పెద్ద హీరోలు సైతం సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు తమిళ్ హీరో ధనుష్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రానికి బదులు మరొక సినిమా మొదలు పెట్టి దానిని పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఈ తరుణం లో ధనుష్ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి ఈ సినిమా షూటింగ్ దశకు తీసుకు వెళ్ళనున్నాడు శేఖర్ కమ్ముల.

సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం చేస్తున్న వెంకీ అట్లూరి సినిమా తరువాత మరొక సినిమాను చేసే విధంగా ఆలోచనలు చేస్తుండగా  శేఖర్ కమ్ముల ఈ గ్యాప్ లో మరొక సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా లీడర్ 2 సినిమా అని అంటున్నారు.  ఆయన దర్శకత్వం వహించిన రానా హీరోగా నటించిన లీడర్ సినిమా పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకోగా ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచన జరుగుతుంది. మరి శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ ప్రయోగం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: