మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ ఆ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన అంటే రేపు ఈ సినిమా విడుదల కాబోతు ఉండగా ఈ చిత్రం కోసం కొరటాల శివ మూడేళ్లు పని చేయడం విశేషం. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మొదలు పెట్టుకోవాల్సిన ఈ సినిమా రోజు రోజుకు వాయిదా పడడం ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆగ్రహానికి గురిచేస్తుంది. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు అని చెప్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను ఎన్టీఆర్ సంపాదించుకోగా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్లోకి సోలో హీరోగా వెళ్లాలని చూస్తున్నాడు.

 ఇకపోతే ఈ చిత్రం తర్వాత కూడా కొరటాల శివ ఆసక్తికరమైన సినిమాలను చేస్తున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న వారితో ఆయన సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆయన చేయవలసిన సినిమా ఇంకా ముందుకు వెళ్లలేదు. ఎన్టీఆర్ చిత్రం తర్వాత ఆయన దాన్ని చేయబోతున్నాడు అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు కొరటాల. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ తో కూడా ఆయన ఓ సినిమా చేసేందుకు ప్రణాళికలు చేశాడు. మరి ఈ సినిమాలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో చూడాలి. సామాజిక అంశాలకు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు దర్శకుడు కొరటాల శివ. అలాంటి దర్శకుడు భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: