అంతేకాదు పెళ్లి తర్వాత తన వివాహజీవితం చాలా సాఫీగా సాగిపోతుందని వారు చాలా హ్యపిగా లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు అజయ్ దేవగణ్ చెప్పాడు. అయితే ''ప్రతి పెళ్లిలో కచ్చితంగా ఎత్తు, పల్లాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకొవడం మంచిది అలాగే ఎప్పుడు కూడా సరే ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఆలోచించలేరు. అంతేకాదు తప్పుపొప్పులను, అలాగే అప్పుడప్పుడు ఏర్పడే విభేదాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇలా కనుక చేస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇక పురుషులు, మహిళలు వేర్వేరుగా వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే అలోచించుకుని అవతలివారినే తప్పు పడతారు. అలా కాకుండా మనం చేసిన పని తప్పు అయితే దానిని ఒప్పుకుని అవతలి వారిని క్షమాపణాలు అడిగినట్లైతే జీవితం చాలా బాగుంటుంది.
అలా కాకుండా ఇగోకు పోతే ఆ జీవితంలో ఇబ్బందులు తప్పవు. నాకు కాజోల్ అంటే చాలా ఇష్టం, ఆమెపై ప్రేమను వివిధ రకాలుగా చూపిస్తాను'' అని అజయ్ దేవగణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే అజయ్, కాజోల్ లు కలిసి 'ఇష్క్', 'రాజు చాచా', 'ప్యార్ తో హోనా హై తా' 'దిల్ క్యా కరే',వంటి చాలా చిత్రాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే అజయ్ దేవగణ్ రీసెంట్ గా 'రన్ వే-34' అనే సినిమా కూడా చేశారు. మరి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ లు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా రేపు అనగా ఏప్రిల్ 29 న విడుదలకు సిద్దంగా ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.