ప్రస్తుతం USA, తెలుగు రాష్ట్రాలలోని ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమాని అభిమానులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ప్రస్తుతం ట్విట్టర్ లో వస్తున్న టాక్ ప్రకారం ఆచార్య మొదటి భాగం ఓకే అనిపించిన సెకండాఫ్ ఫస్టాఫ్ ని మించేలా ఉన్నది. చిరంజీవి బాగానే నటించినప్పటికీ రామ్ చరణ్ పాత్ర ఆచార చిత్రానికి సోల్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా దీంతో అబ్బో యావరేజ్ గా ఉందని తెలియజేస్తున్నారు.
మరికొందరయితే ట్విట్టర్లో ఆచార్య సినిమా పట్ల బాగా డిసప్పాయింట్ అయినట్లుగా కూడా పోస్టులు పెడుతుండటం జరుగుతోంది. చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు రాక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. అయితే డైరెక్టర్ కొరటాల శివ ఈ తరహాలో ఇలాంటి స్క్రిప్ట్ ఉంటుందని అనుకోలేదని.. స్క్రిప్టు చాలా వీక్ ఉన్నట్లుగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.
ఇక ఆచార్య చిత్రంలో పాజిటివ్ గా చెప్పుకోవాల్సింది కేవలం చిరంజీవి చరణ్ పాత్రలే.. మిగిలిన పాత్రలన్నీ చాలా బిజీగా ఉన్నట్లు గా సమాచారం. VVFX చాలా పూర్ గా ఉన్నది, నెరేషన్ సరిగ్గా లేదు.. మొదటిసారి కొరటాల శివ చాలా తీవ్రంగా నిరాశ పరిచారు అభిమానులు కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. చిరంజీవి వేసిన డాన్సులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో ఎక్కువగా అనవసరంగా ఫైట్స్ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతంత మాత్రమే ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.