ఎవరికైనా కలిసి రావాలంటే అదృష్టం తోడవ్వాలి లేదంటే ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించిన వారికి చివరికి ఫెయిల్యూరే మిగులుతుంది. ఆ విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగే విషయంలో అదృష్టం ఆయనకు బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. పుష్ప సినిమా కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే బాలీవుడ్ లో ఈ చిత్రం వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమా అక్కడి వారితో పాటు ఇక్కడి మేకర్స్ కు కూడా గిమ్మ తిరిగి పోయేలా చేసింది.

ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు అంటే ఈ సినిమా ఏ స్థాయి లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. మంచి హార్డ్ వర్క్ తో పాటు కొంత అదృష్టం కూడా కలిసి వచ్చి ఈ సినిమా కు ఇంతటి హిట్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అయితే ఈ విధంగా చేయబోయి చిరు ఫెయిల్ అయిపోయారు.

తన కొడుకును పాన్ ఇండియా హీరోగా మార్చే క్రమంలో చిరు రాంగ్ వె లో వెళ్ళాడు అని చెప్పవచ్చు. ఆర్ ఆర్ ఆర్ సినిమా హిట్ లో చాలా భాగం క్రెడిట్ రామ్ చరణ్ కే దక్కింది. ఆ సినిమాకు మెయిన్ హీరో తనే అనేలా నటించాడు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఎలాంటి అంచనాలు లేని సినిమా తో రావాలని చిరు ప్లాన్ చేశాడు. పుష్ప అలా వచ్చి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా హిట్ అయ్యింది కాబట్టి బన్నీ కి మంచి పేరొచ్చింది. కానీ ఆచార్య సినిమా కు ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో రామ్ చరణ్ పై ఇప్పుడు ఇంకా ఒత్తిడి పెరిగింది. శంకర్ సినిమా తో ఆయన మళ్ళీ హ్యూజ్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఈ సినిమా చిరు, చరణ్, మెగా అభిమానుల కోరిక మేరకు పాన్ ఇండియా స్థాయి లో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: