
అలా వరుస సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో భాగంగా ప్రస్తుతం రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఒక సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాకు "ఏజెంట్" అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు అని తెలిసిందే. ఈ సినిమాతో అఖిల్ ఎలాగయినా తన స్టామినాను నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నాడు. అందుకు తగినట్లే ఈ సినిమాను సరికొత్తగా రూపొందిస్తున్నారు. సురేంద్ర రెడ్డికి స్క్రీన్ ప్లే విషయంలో మంచి పట్టుంది. అందుకే ఈ సినిమా తన కెరీర్ కి మంచి సక్సెస్ ను అందిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అసఙ్కత్ని కలిగించడానికి కొత్త కొత్త గెట్ అప్స్ తో అఖిల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. తాజాగా జిమ్ లో చేస్తున్న వర్క్ ఔట్స్ ను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. మరి గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్‌ను దక్కించుకున్న అఖిల్, ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించేందుకు ప్రేక్షకుల ముందుకు ఏజెంట్ రూపంలో రానున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.