‘అల వైకుంఠ పురములో’ మూవీ తరువాత పూజా హెగ్డే కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె డేట్స్ ఇస్తే చాలు అంటూ అనేకమంది దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరగడంతో ఆమె తన పారితోషికాన్ని 3.5 కోట్ల స్థాయికి చేరుకుంది. అయితే నడుస్తున్న కాలం ఆమె కెరియర్ కు ఏమాత్రం సహకరించకపోగా గతంలో ఆమెను వెంటాడిన ఐరన్ లెగ్ ట్యాగ్ మళ్ళీ పూజను వెంటాడటం మొదలుపెట్టింది.


‘రాథే శ్యామ్’ ‘బీస్ట్’ ఇప్పుడు లేటెస్ట్ గా ‘ఆచార్య’ మూవీలు వరస ఫ్లాప్ లుగా మారడంతో ఈ ఫ్లాప్ ల ప్రభావం ఆమె కెరియర్ పై చూపెట్టే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూజా నటిస్తున్న పెద్ద సినిమాలు ఏమి లేవు. మే నెలాఖరులో విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’ లో ఈమె ఐటమ్ సాంగ్ చేసింది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈవిషయమై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.


పూజా హెగ్డే ను విపరీతంగా ప్రోత్సహించే త్రివిక్రమ్ మహేష్ తో మొదలుపెట్టబోతున్న మూవీలో ఈమెను ఎంపిక చేసారు అని వార్తలు వస్తున్నప్పటికీ మహేష్ దృష్టి మాత్రం కియారా అద్వాని పై ఉంది అంటున్నారు. ఇక పవన్ నటించబోయే ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీలో కూడ ఈమె నటిస్తోంది అన్నప్రచారం జరుగుతోంది కానీ ఈవిషయమై దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా అధికారికంగా చెప్పడం లేదు.


దీనితో పూజా హెగ్డే నటించే భారీ సినిమాలు ఏమీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిచడం లేదు. మరొకవైపు పూజా హెగ్డే కు గట్టి పోటీ ఇస్తున్న రష్మిక వరసపెట్టి బాలీవుడ్ లో కూడ అవకాశాలు కొట్టేస్తుంటే ఈ రేస్ లో ప్రస్తుతానికి పూజ వెనకపడింది అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో కొనసాగే మ్యానియా అదేవిధంగా ర్యాంకింగ్ లు ఏమీ శాశ్వితం కాదు. అందువల్లనే క్రేజ్ ఉన్నప్పుడే కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకోవడానికి హీరోయిన్స్ ప్రయత్నిస్తారు..


మరింత సమాచారం తెలుసుకోండి: