మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినమా మిశ్రమ ఫలితం అందుకోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా యొక్క ఫలితం పై తీవ్రమైన నిరాశలో ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించగా ఈ చిత్రం తప్పకుండా మెగా అభిమానులకు ట్రీట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పాలి. కారణం ఏదైనా కూడా మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చేసిన ఈ సినిమా ఈ విధంగా అయిపోవడం పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నారు.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఏమో కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన కొన్ని వివాదాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ విషయంలో కొరటాల శివ మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నాడనే విషయం బయటకు వస్తుంది. సంగీతం విషయంలో కూడా ఆయనకు మణి శర్మ కు మధ్య గొడవ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగ రాదు కాబట్టి ఈ రకమైన వార్త ప్రచారం అవ్వడం లో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.