యాంకర్ సుమ..ఈ పేరు అందరికి తెలుసు..డ్యాన్సర్ గా తనలోని ప్రతిభను ప్రూవ్ చేసుకొని, తర్వాత యాక్టర్ గా కొన్ని సినిమాలు చేసింది.హిరోయిన్ గా సహాయనటిగా నటించి అందరి మనసును దొచుకుంది. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి యాంకర్‌గా తన టాలెంట్ ను చూపిస్తూ బాగా ఫెమస్ అయ్యింది. రాజీవ్ కనకాల తో ప్రేమలో పడి పెళ్ళి పీటలెక్కింది.అప్పటి నుంచి సినిమలలో తక్కువగా మెరిసింది..టీవీ షోలు, సినిమా ఆడియో పంక్షన్లు అంటూ బిజీ అయిపోయింది.దాంతో రెండు చేతులా సంపాదిస్తుంది.


అదేమిటో గానీ సుమతో సినిమాల ఆడియో లాంచ్, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చేస్తె బాగా సక్సెస్ అవుతాయని నమ్మకం..అలా సుమ మరింత ఫెమస్ అయ్యింది.టీవీలలో వచ్చే డైలీ షోల వల్ల యూత్ కు బాగా దగ్గరైంది. అలా సుమక్క అయ్యింది. ఇకపోతే సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటిస్తుంది. జయమ్మ పంచాయితీ.. టైటిల్ కు తగ్గట్లే సినిమా లో సుమ పాత్ర వుంటుందని తెలుస్తుంది.విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వం వహించారు. బలగ ప్రకాష్‌ నిర్మాత. ఈనెల 6న విడుదల అవుతోంది.


ఈ మేరకు హైదరాబాద్ లో ప్రీరిలిజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించారు.ఆ కార్యక్రమానికి అక్కినేని నాగర్జున, నాని, రాజమౌళి, కీరవాణి మొదలగు వాళ్ళు  హాజరయ్యారు.. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ..నేనిక్కడికి పంచాయితీ అంటే రాలేదు. సుమ ప్రేమతో పిలిస్తే వచ్చా. సినిమా వేడుకలా కాకుండా.. ఓ పండగలా ఉంది ఈ వాతావరణం. సుమ చాలా ప్రతిభావంతురాలు. తనలోని ప్రతిభని పది శాతం వాడుకున్నా ఈ సినిమా విజయవంతం అవ్వడం ఖాయం అన్నారు. నాని మాట్లాడుతూ ''జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ చూశాక.. సుమ స్టేజీ మీద కంటే వెండి తెరపై ఎక్కువ బిజీ అవుతారనిపిస్తోందని అన్నారు.స్టార్ట్స్ సపోర్ట్ వల్ల సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: