ప్రస్తుతం సర్కారువారి పాట' చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో భార్యాపిల్లలతో కలసి ఫారిన్ ట్రిప్ వెళ్లారు మహేశ్‌బాబు. ప్రస్తుతం వీరంతా ప్యారిస్‌లో ఉన్నారు.ఫ్యారిస్ వెళ్లినప్పుడల్లా అక్కడున్న లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్‌లో దిగడం మహేశ్‌బాబుకు అలవాటు. ఆ హోటల్‌లో జూనియర్ సూట్‌కు రోజుకి ఎంత వసూలు చేస్తారో తెలుసా.. అక్షరాలా లక్షన్నర అని వార్తలు వినిపిస్తున్నాయి..
నిజంగానే అంత స్పెండ్ చేయడం మహేష్ బాబుకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. కళ్ళు చెదిరే ధర అని చెప్పాలి.హోటల్ లాబీలో ఓ పెయింటింగ్ ముందున్న సోఫాలో కూతురు సితారతో కలసి కూర్చుని ఇంతకుముందు దిగిన ఫొటోను, ఇప్పుడు దిగిన ఫొటోను' అప్పుడు.. ఇప్పుడు' అని కాప్ఝన్ పెట్టి బుధవారం నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'ప్యారిస్‌లో నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి' అని కూడా పేర్కొన్నారు. అలాగే మహేష్ బాబు, నమ్రత లు కూతురు సిథారతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫ్యామిలీ ఫోటోలను చూసిన మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఈ మధ్య పూర్తీ అయ్యింది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్ని సినిమా పై భారీ అంచనలను పెంచుతుంది.మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో మే 12 న చూడాలి.