తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వారసత్వం కారణంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి ఎంత శ్రమించినా అదృష్టం తలుపు తట్టాదు. ఇలాంటి వాళ్లని ఏ ఇండస్ట్రీ వాళ్లయినా సరే దురదృష్టవంతులు గా అంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యువ హీరో పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. యువ హీరో మెగా ఫ్యామిలీకి బంధువు అయినా సరే అవకాశాలు తక్కువగా రావడమే కాకుండా సరైన విషయాలను కూడా అందుకోలేక పోతున్నారు. ఈ హీరో గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


మెగాస్టార్ చిరంజీవి, పవన్, రామ్ చరణ్, తదితర హీరోలు సైతం తమ స్టార్ డమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి అల్లు ఫ్యామిలీ వరకు ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు. త్వరలో అకీరా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండదు మెగా ఫ్యామిలీ నుండి ఒక యువ హీరో వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అతనే పవన్ తేజ్. మెగా ఫ్యామిలీ కాకపోయినప్పటికీ ఈయన మెగా ఫ్యామిలీకి దూరపు బంధువు.. అంటే చిరంజీవి తండ్రికి బంధు అన్నమాట.

తన తొలి సినిమా సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అందుచేత ఈ హీరో ని కూడా మెగా ఫ్యామిలీ కింద జమ చేస్తున్నారు. యువ హీరో నటించిన చిత్రం" ఈ కథలో పాత్రలు కల్పితం" ఈ సినిమా విషయంలో మెగా హీరోల నుంచి పవన్ తేజ్ కు ఎటువంటి సపోర్ట్ కూడా లభించలేదు దీంతో ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే సరైన అవకాశం ఎదురుచూస్తున్న సమయంలో పవన్ తేజ్ కు చిరంజీవి తో నటించే అవకాశం వచ్చింది. అదే ఆచార్య సినిమా. ఈ సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు వచ్చి మంచి అవకాశాలు వస్తాయని ఆశపడ్డాడు కానీ ఈ చిత్రం కూడా అడియాస గా మిగిలిపోయింది. ఆచార్య సినిమాలో విలన్ బ్యాచ్లో ఒకడిగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: