ఆచార్య సినిమా కొరటాలకు ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. ఒకవైపు కెరియర్ లో తొలిసారిగా పరాజయం అందులోనూ భారీ డిజాస్టర్ మరో వైపు మెగా ఫ్యాన్స్ కురిపిస్తున్న విమర్శలు ఇంకో వైపు మా హీరో సంగతి ఏంటి బాస్ మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి అంటూ యంగ్ టైగర్ అభిమానుల కామెంట్లు మధ్య సతమతమౌతున్నారు దర్శకుడు కొరటాల శివ. అయితే నిజానికి కొరటాల ఎన్టీఆర్ తో అనుకున్న తన తదుపరి ప్రాజెక్ట్ ను ఈ పాటికే ప్రారంభించాల్సి ఉండగా రోజులు గడుస్తున్నా దాని గురించి ఊసే లేకపోవడం గమనార్హం. ఎన్నో అంచనాలతో తీసిన మెగా మూవీ ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో తారక్ తో సినిమా విషయంలో సందిగ్ధంలో పడ్డారట కొరటాల.

అయితే తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ నుండి కొరటాల శివకు కాల్ వెళ్లిందని తమ సినిమా గురించి చాలా సేపు చర్చించుకున్నారు అని తెలుస్తోంది. దర్శకుడు కొరటాలకు ఫోన్ చేసిన తారక్ ముందుగా ఆయన్ను కాస్త ఓదార్చి మీరేం బాధపడకండి, ఇండస్ట్రీలో కొన్ని సార్లు అటు ఇటు అవుతూ ఉంటుంది అలాగని నిరాశలో మునిగిపోకూడదు. అందులోనూ మీలాంటి టాలెంటెడ్ దర్శకుడు ఎలా ఉండాలి అంటూ బూస్ట్ ఇచ్చారట. ఇక మన నెక్స్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ తో మరోసారి సత్తా చాటుదాం, నేనున్నాను అంటూ దైర్యం చెప్పారట ఎన్టీఆర్. అంతే కాకుండా కథకు ఇంకొన్ని కమర్షియల్ హంగులు దిద్దితే బాగుంటుందని తెలిపారట.

అయితే అది నా అభిప్రాయమే తప్ప కంపల్సరీ కాదని కూడా అన్నారట. తారక్ ఇప్పుడే కాదు మొదటి నుండి కూడా దర్శకులను డిస్టర్బ్ చేయడు. వారు చెప్పింది చేసుకు పోతుంటారు, పెద్దగా ఏదైనా అనిపిస్తే తప్ప పెద్దగా సలహాలు కూడా ఇవ్వరు, ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని నమ్మే వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఆచార్య సినిమా నిరాశలో కొరటాల ఎన్టీఆర్ మూవీ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో  మొత్తానికి వీరి కాంబోలో సినిమా ఖచ్చితంగా ఉండనుంది సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: