సమంత ఎక్కువగా కమర్షియల్ మూవీస్ చేసినా ఎప్పుడూ గ్లామర్ గేట్లు ఎత్తలేదు. సెమీ మోడ్రన్ లుక్‌లోనే కనిపించింది. అయితే 'ఫ్యామిలీమెన్2'తో తొలిసారి వెబ్ సీరీస్‌లోకి అడుగుపెట్టాక, పాత లెక్కలన్నిటిని పక్కనపెట్టేసింది. చాలెంజింగ్ రోల్ అని బోల్డ్ సీన్స్‌లోనూ నటించింది. రాజీ క్యారెక్టర్‌లో సమంతని చూసి టాలీవుడ్ జనాలు కూడా ఆశ్చర్యపోయారు.
కియారా అద్వాని ఇప్పుడు బాలీవుడ్ నంబర్ గేమ్‌లో తెగ హడావిడి చేస్తోంది. పాన్ ఇండియన్ మూవీస్‌తో కోట్లు అందుకుంటోంది. అయితే కియారా ఇంత బిజీ అవ్వడానికి వెబ్ ఫిల్మ్ 'లస్ట్‌స్టోరీస్' కారణమని చెప్పొచ్చు. అడల్ట్ లైన్‌తో వచ్చిన ఈ సీరిస్‌లో కియారా బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఇక ఆ క్యారెక్టర్‌తో యూత్‌కి ఫుల్లుగా కనెక్ట్ అయ్యింది. బాలీవుడ్‌లో బిజీ అయింది.
రామ్ గోపాల్ వర్మ లెస్బియన్ స్టోరి 'డేంజరస్'ని ప్రదర్శించేదని మల్టీప్లెక్స్ సంస్థలు పివిఆర్, ఐనాక్స్ స్టేట్ మెంట్స్ ఇచ్చాయి. అయితే కొందరు తమంది ఆర్టిస్టులు మాత్రం చాలెంజింగ్ రోల్స్ అని వెబ్ సీరీసుల్లో హోమో సెక్సువల్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 'హ్యూమన్' సీరీస్‌లో కృతి కుల్హరి, షెఫాలి షా ఇద్దరూ లెస్బియన్స్‌గా నటించారు.
మరోవైపు ఓటీటీ మార్కెట్ పెరిగాక ఆడియన్స్‌లోనూ చాలా మార్పులొచ్చాయి. వరల్డ్ క్లాస్ సీరీసులు, సినిమాలకి ఫిదా అవుతున్నారు. యూనిక్ స్టోరీస్‌కి భారీ రెస్సాన్స్ వస్తోంది. దీంతో తెలుగు స్టార్స్ కూడా మారిపోతున్నారు. ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యేందుకు వెబ్ సీరీసులు చేస్తున్నారు. యంగ్‌స్టర్స్‌తో పాటు సీనియర్ హీరోలు కూడా ఓటీటీల్లో అడుగుపెడుతున్నారు.
నాగచైతన్యకి తెలుగునాట లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఈ రొమాంటిక్ హీరో సర్కిల్ నుంచి బయటపడి మాస్ సినిమాలు చేసిన ప్రతీ సారి చైతన్యకి నిరాశే ఎదురైంది. థ్రిల్లర్ జానర్‌లోకి వెళ్లినా ఆశించిన ఫలితం రాలేదు. అందుకే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక థ్రిల్లింగ్ వెబ్ సీరీస్ చేస్తున్నాడు. హీరోగా చేసేటప్పుడు ప్రయోగాలు ఎందుకు, స్టార్ హీరోగా మార్కెట్ సంపాదించుకుందాం అనే లెక్కల వైపు వెళ్లకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు రానా. ఓటీటీ కోసం ఒక వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు. 'రానా నాయుడు' వెబ్ సీరీస్‌లో రానాతో కలిసి నటిస్తున్నాడు వెంకటేశ్.