'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్‌కి కోలీవుడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా తర్వాత తమిళ హిట్ 'తడమ్'ని 'రెడ్'గా రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు తమిళ డైరెక్టర్ లింగుసామితో ఒక బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. నాగచైతన్య 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఆమిర్ ఖాన్ స్టార్డమ్‌తో గుర్తింపు వస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఇక ఇదే జోష్‌లో తమిళ్ మార్కెట్‌కి వెళ్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేశాడు నాగచైతన్య.
రజనీకాంత్, కమల్ హాసన్ స్లో అయ్యాక కోలీవుడ్ స్టార్లు చాలామంది ఆ వ్యాక్యూమ్‌ని వాడుకోవడానికి ప్రయత్నించారు. ఒకటి రెండు హిట్స్ రాగానే రెమ్యూనరేషన్లు పెంచుకున్నారు. అయితే మార్కెట్ మాత్రం పెంచుకోలేదు. దీంతో నిర్మాతలకి లాభాల్లో కోతలు పడుతున్నాయి. ఆ కటింగ్స్‌ని తగ్గించడానికి బైలింగ్వల్స్, మల్టీలింగ్వల్స్ చేస్తున్నారు తమిళ స్టార్లు. 'జాతిరత్నాలు' సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అనుదీప్. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో అందరినీ డామినేట్ చేసి యాక్టింగ్‌లోకి వస్తాడా అనే డౌట్స్ క్రియేట్ చేసిన అనుదీప్ ఇప్పుడు కోలీవుడ్‌కి వెళ్లాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ తీస్తున్నాడు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ధనుష్‌కి కోలవెర్రి సాంగ్‌తో వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. 'రఘువరన్ బీటెక్, మారి' సినిమాలతో తెలుగులో కూడా స్టార్డమ్ వచ్చింది. ఈ మార్కెట్ లెక్కలతోనే ధనుష్‌తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్స్ తీస్తున్నారు నిర్మాతలు. ఆల్రెడీ శేఖర్ కమ్ముల ధనుష్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఇక వెంకీ అట్లూరి, ధనుష్‌తో 'సార్' అనే సినిమా తీస్తున్నాడు. తమిళ్లో ఈ మూవీ 'వాతి' పేరుతో విడుదల కాబోతోంది. వంశీ పైడిపల్లి 'మహర్షి' తర్వాత మళ్లీ మహేశ్ బాబుతోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత కోలీవుడ్‌కి వెళ్ళాడు. విజయ్‌తో మల్టీలింగ్వల్ మూవీ అనౌన్స్ చేశాడు. ఇక విజయ్ చాలా రోజులుగా తెలుగులో స్టార్డమ్ సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్‌లోనూ పాతుకుపోవాలని తెగ ట్రై చేస్తున్నాడు.