కన్నడ సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచిన "కేజీఎఫ్ 2" మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అందరినీ ఎంతగానో ఆకట్టుకుని 1100 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా ఎక్కువ సాధించేందుకు ఉవ్విల్లూరుతోంది. ఈ సినిమాలో రాఖీ బాయ్ గా నటించిన యష్ కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. కేవలం రెండు సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు. ఇందులో మిగిలిన పాత్రలలో నటించిన అందరికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులు అందరికీ ఒక బాధను కలిగించే వార్త అని చెప్పాలి.  

ఈ సినిమాలో నటించిన ఒక కీలక నటుడు ఈ రోజు మరణించాడు. ఇతను కేజీఎఫ్ సినిమా ఫస్ట్ పార్ట్ లో విలేఖరికి రాఖీ బాయ్ గురించి చెబుతున్నప్పుడు "గ్యాంగ్ తో పాటు వచ్చే వాడు గ్యాంగ్ స్టర్... అతను ఒక్కడే వస్తాడు మాన్ స్టర్" అని చెబుతాడు. ఈయన చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీన్ లో కనిపించే మోహన్ జునేజా మరణించినట్లుగా తెలుస్తోంది. రెండవ పార్ట్ లో కూడా ఉన్నాడు. కన్నడలో జోగి అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన తనదైన నటనతో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్ లో ఇప్పటి వరకు 100 కు పైగా సినిమాలలో నటించి మెప్పించాడు.

గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. గత రాత్రి చిక్కబాణవర సప్తగిరి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించారు. ఒక మంచి నటుడు మన మధ్య లేరని తెలిసిన అభిమానులు మరియు సినిమా వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: