ఇలాంటి పరిస్థితులలో మహేష్ ఎవరు ఊహించని విధంగా అఖిల్ మ్యానియా పెంచడానికి సహకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మొట్టమొదటి సినిమా ప్రమోషన్ ను కూడ మహేష్ చేసాడు. అయితే పెద్దగా కలిసి రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ మరొకసారి అఖిల్ కోసం మహేష్ రంగంలోకి దిగుతున్నాడు. వచ్చేవారం విడుదలకాబోతున్న ‘సర్కారు వారి పాట’ మూవీని ప్రదర్శించే ధియేటర్లలో అఖిల్ సురేంద్ర రెడ్డిల ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ ను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
‘సైరా’ మూవీ ఫలితం నిరాశ పరచడంతో సురేంద్ర రెడ్డి అఖిల్ ‘ఏజెంట్’ గురించి చాల శ్రద్ధ పెట్టాడు. ఈమూవీ కోసం అఖిల్ కూడ చాల కష్టపడ్డాడు. అందంగా ఉండే అఖిల్ ఈసినిమాలో రఫ్ గా కనిపించడానికి సిక్స్ ప్యాక్ ను కష్టపడి మెయిన్ టైన్ చేసాడు. టాప్ హీరో సినిమాల హడావిడి పూర్తి కావడంతో ఈమూవీని ఆగష్టులో విడుదల చేయబోతున్నారు. అయితే ఈమూవీ విడుదలకు దగ్గరగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ రాబోతోంది.
అయినా అఖిల్ ధైర్యంగా ఆగష్టులో వచ్చేస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ హిట్ తరువాత అఖిల్ మళ్ళీ మాస్ హీరోగా మారాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అక్కినేని యంగ్ హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా మాస్ హీరోలుగా మారలేక పోతున్నారు. దీనితో అఖిల్ మాస్ హీరో కలలను ఎంతవరకు సురేంద్ర రెడ్డి నెరవేర్చగలడు అన్నవిషయమై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు నాగార్జున కూడ 100 కోట్ల క్లబ్ లో చేరకపోవడం ఒక లోటు అనుకోవాలి ఆలోటును అఖిల్ భర్తీ చేయగలడేమో చూడాలి..