మెహ్రీన్' కెరీర్ అసలే అంతంత మాత్రంగా సాగుతు వుంది.. ఇలాంటి టైమ్ లో ఏ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని ఆరాట పడుతుంది.

పనిలోపనిగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఉత్సాహం చూపిస్తుంది. కానీ, ఇక్కడే 'మెహ్రీన్' తెలివితేటలు చూపిస్తుందట. తన దగ్గరకు ఓటీటీ ఆఫర్లతో వచ్చిన నిర్మాతలను తను మభ్య పెడుతోంది. ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ ఐడియాతో ఓ యంగ్ డైరెక్టర్హీరోయిన్ ను సంప్రదించాడట.. కానీ, ఓటీటీలో నటించడం 'మెహ్రీన్'కు ఇష్టం లేదట.


అలా అని కథను వదులుకోవడానికి 'మెహ్రీన్' ఇష్టపడలేదట.ఈ కథను సినిమా చేద్దామని ఆ యంగ్ డైరెక్టర్ ను ఊరించిందట.. 'మెహ్రీన్'తో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ఏమిటయ్యా ? అంటూ ఆ డైరెక్టర్ దగ్గర ఉన్న నిర్మాత చేతులు ఎత్తేశాడట. దీంతో, ఆ డైరెక్టర్ కి నిర్మాత లేకుండా పోయాడట.. 'నేనే చూస్తాను నిర్మాతను' అని అభయం ఇచ్చిందట.. ఇప్పటికే ఈ అభయం ఇచ్చి నాలుగు నెలలు అయ్యిందట..



నిర్మాతని అయితే చూడలేదు. కట్ చేస్తే.. నానాపాట్లు పడి ఆ డైరెక్టరే మరో నిర్మాతను చూసుకున్నాడట.. మళ్ళీ వ్యవహారం మొదటికే వచ్చిందట. సినిమాకు కావాల్సిన హంగులు, ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో ఉన్నాయని.. కాబట్టి ఈ కథను సినిమాగా మార్చి చేద్దామంటే వెంటనే కాల్షీట్లు ఇస్తానని కబుర్లు చెప్పుకొచ్చిందట మెహ్రీన్'. వాళ్ళు కూడా ఊ అన్నారు. కానీ.. రెమ్యునరేషన్ విషయంలో మరో మెలిక పెట్టిందట..


తనకు 80 లక్షలు ఇవ్వాలని 'మెహ్రీన్' కండిషన్ అయితే పెట్టింది. నిజానికి ఆ కథ సినిమాగా అస్సలు పనికిరాదు. బి, సి సెంటర్లలో ఈ కథ పెద్దగా వర్కౌట్ కూడా కాదు. ఇవన్నీ ఆలోచించే సదరు దర్శకుడు వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపాడట.. కానీ 'మెహ్రీన్'కి మాత్రం వెబ్ లో చేయడం ఇష్టం లేక, ఇన్నాళ్లు సినిమా చేద్దామంటూ కలరింగ్ ఇచ్చిందట.

ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ అంటూ కవరింగ్ అయితే చేస్తోంది. అసలు ఇష్టం లేకపోతే ఇప్పటి వరకు తిప్పించుకోవడం ఎందుకు ? రోజుకొక కబురు చెప్పడం అస్సలు ఎందుకు ? ఏది ఏమైనా ఒక అప్ కమింగ్ డైరెక్టర్ జీవితంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం 'మెహ్రీన్'కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: