జెనీలియా పెళ్లి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి కంప్లీట్‌గా దూరమైంది. ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయింది. 'నా ఇష్టం' తర్వాత మళ్లీ టాలీవుడ్లో అడుగుపెట్టలేదు. మరాఠి, హిందీ సినిమాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చినా.. దక్షిణాది చిత్రాల్లో మాత్రం కనిపించలేదు. అయితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వస్తోంది జెనీలియా. గాలి జనార్ధన్ కొడుకు కిరీటీ హీరోగా లాంచ్ అవుతోన్న తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది హాసిని.
సొనాలి బింద్రే క్యాన్సర్ నుంచి కోలుకున్నాక మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతోంది సొనాలి. జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీలో సొనాలి ఒక కీరోల్ ప్లే చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. హోమ్లీ క్యారెక్టర్స్‌తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన మీరా జాస్మిన్, భర్తతో విడిపోయాక మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. మళయాళీ మూవీ 'మకల్'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక త్వరలోనే టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్గా చేసిన ఖుష్బూ 'స్టాలిన్'తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా ఇక్కడ వరుసగా సినిమాలు చేయలేదు. కానీ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సైన్ చేస్తోంది. తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో ఖుష్బూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది.