అయితే ఈ రోజున సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న గార్గి చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో ఎప్పట్లాగానే సాయి పల్లవి సాంప్రదాయమైన చీరకట్టులో భుజాన ఒక బ్యాగ్ తగిలించుకొని సాధారణ అమ్మాయి గా కనిపిస్తోంది సాయి పల్లవి దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో న్యాయదేవత కూడా బొమ్మ కనిపిస్తుంది.
ఇక ఈ మేకింగ్ వీడియోలో నువ్వు టైమ్ రాత విధి.. అంటూ చెప్పే డైలాగ్స్ సాయి పల్లవి కనిపిస్తుంది. గారికి ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి ఈ చిత్రంలో అందరినీ ఎదిరించి ఏదో న్యాయం కోసం పోరాడుతున్నట్లు గా కనిపిస్తోంది. ఇక సాయి పల్లవి ఈ చిత్రంలో మరొక విలక్షణమైన పాత్రలో కనిపించబోతోందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం రామచంద్రం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించబడింది ఉన్నామని చిత్రబృందం తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.