హనూ రాఘవపూడి 'లై, పడి పడి లేచే మనసు' ఫ్లాపులతో కొంచెం స్లో అయ్యాడు. ఈ డిజాస్టర్స్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సైనికుడి ప్రేమకథాంశంతో 'సీతారామం-యుద్ధం రాసిన ప్రేమ' అనే సినిమా తీస్తున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న కీ-రోల్ ప్లే చేస్తోంది.బాక్సాఫీస్ దగ్గర ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి మాస్ సినిమాలకి భారీ వసూళ్లు వస్తే మరోసారి లవ్‌స్టోరీస్ అదరగొడుతుంటాయి. ఇక మిలిటరీ బ్యాక్ డ్రాప్ కథాంశాలు అయితే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా కనిపిస్తుంటాయి. అందుకే ఫిల్మ్ మేకర్స్ చాలామంది సైనికుల కథని సేఫ్‌గేమ్‌గా చూస్తున్నారు. లవ్ స్టోరీస్‌తో తెలుగునాట మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నాగచైతన్య, 'లాల్‌సింగ్ చడ్డా'తో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ మూవీలో చైతన్య సపోర్టింగ్ రోల్ చేశాడు. ఆర్మీ జవాన్ పాత్ర పోషించాడు. ఇక 'లాల్‌సింగ్ చడ్డా'తో హిందీలో మంచి గుర్తింపు వస్తుందని ఆశ పడుతున్నాడు చైతన్య.
మాస్ మూవీస్ ట్రై చేసినా, మాస్ హీరో కాలేకపోతోన్న వరుణ్ ధావన్, మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ఇండో-పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్లిపోతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో బసంతర్ ఘటనలో అమరుడైన అరుణ్ కేధార్‌పాల్ కథాంశంతో 'ఇక్కీస్' అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ ఇప్పటివరకు యాక్షన్ జానర్‌లో అడుగుపెట్టలేదు. 'పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్‌కల్' అంటూ అమ్మాయిలు, పువ్వుల చుట్టూనే తిరిగాడు. అయితే ఈ కథలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో పేటియాట్రిక్ స్టోరీస్‌లోకి వచ్చాడు కార్తీక్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా 'కెప్టెన్ ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలెట్ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా.