మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వగా, రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ఎన్టీఆర్ పై ఒక స్పెషల్ ఫోటో షూట్ కూడా నిర్వహించిందట యూనిట్. ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింతగా పెంచేలా భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని, తామిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ని మించేలా మరింత అద్భుతంగా కొరటాల శివ ఈ మూవీ తీయనున్నారని టాక్. ఇప్పటికే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయిన ఈ మూవీ లాంఛనంగా మే 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభం కానున్నట్లు టాక్.
ఇటీవల చిరు, చరణ్ లతో తీసిన ఆచార్య తో పెద్ద డిజాస్టర్ చవి చూసిన కొరటాల శివ, ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ కొట్టాలని మరింతగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తమ టీమ్ అంతా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ పై వర్క్ చేసారని, అలానే సినిమా కోసం పలు సెటింగ్స్ ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఆచార్య తో ఢీలా పడ్డ కొరటాల, ఎన్టీఆర్ మూవీతో పెద్ద హిట్ కొట్టేలా ఉన్నారుగా అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.