మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.. ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.. ప్రేక్షకుల కు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.. ఈయన ఒక్కసారి కమిట్ అయితే వెంటనే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు.. మధ్యలో ఆ సినిమాకు బ్రేకులు ఉండవు.. అయితే సర్కారు సినిమా మాత్రం కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల విడుదల అయ్యి భారీ సక్సెస్ ను అందుకుంది. మహేష్ బాబు ఈ సినిమా లో మరింత అందంగా కనిపించి అమ్మాయిల మనసు దోచేశాడు.. మరి ఇలాంటి స్టార్ హీరో చార్మింగ్ హీరో అయినా మహేష్ బాబు తో నటించాలని హీరోయిన్స్ అందరికి ఉంటుంది..
మహేష్ బాబు తో నటిస్తే మాస్ ఇమేజ్ రావడం పక్కా అని అంటున్నారు.. ఈ విషయం ఇప్పుడు సర్కారు సినిమాతో కూడా ప్రూవ్ అయ్యింది. కీర్తి ఎంత క్లాస్ పాత్రలలో నటించిందో అందరికి తెలుసు.. కానీ ఈ సినిమా లో మాత్రం అమ్మడు మాస్ పాత్రలో చితక్కొట్టింది అనే చెప్పాలి. గతంలో రష్మిక, పూజాహెగ్డే లు కూడా మహేష్ సరసన నటించి బాగా పాపులర్ అయ్యారు.. ఆ సెంటిమెంట్ అందరికి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఎ హీరోయిన్ మహేష్ తో ఫెమ్ తెచ్చుకుంటారో చూడాలి..