వాస్తవానికి తొలిరోజు ప్రీమియర్స్ సమయంలో ఒకింత మిశ్రమ స్పందన అందుకున్న సర్కారు వారి పాట మెల్లగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు నేటి సమాజంలోకి ఒక కీలకమైన అంశాన్ని తీసుకుని దానిని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీ తీయడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల పూర్తిగా సఫలం అయ్యారు అనే చెప్పాలి. ఇక మరోవైపు మహేష్ కి యాంటీ గా ఎందరు ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో నెగటివ్ కథనాలు ప్రచారం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా సూపర్ స్టార్ సూపర్ మేనియా ముందు ఏమాత్రం నిలబడలేకపోయాయి.
అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే చాలా ఏరియాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న సర్కారు వారి పాట సక్సెస్ మీట్ ని నిన్న రాత్రి కర్నూలులో ఏర్పాటు చేసారు. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు విచ్చేసిన ఈ వేడుకలో తమ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన మహేష్, మధ్యలో మ మ మహేషా సాంగ్ కి డ్యాన్సర్లు తో కలిసి చిందేయడం అందరినీ ఎంతో అలరించింది. తన కెరీర్ మొత్తంలో కూడా తొలిసారిగా సూపర్ స్టార్ ఈ విధంగా స్టేజి మీదకు వచ్చి చిందేయడం చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి అనే చెప్పాలి.