రాశి ఖన్నా కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. హిందీలో అవకాశాలు రాకపోతేనే, రాశి సౌత్‌కి వచ్చింది. ఇక్కడ స్టార్డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు లైఫ్ ఇచ్చిన దక్షిణాది సినిమా వాళ్లని విమర్శిస్తోందని ట్రోల్ చేశారు. ఇక ఈ విమర్శలు రాశి వరకు వెళ్లడంతో ఒక ప్రకటన విడుదల చేసింది. తాను అనని మాటలని అన్నట్టు ప్రచారం చేస్తున్నారనీ.. అంతా అబద్ధం అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది రాశి.
తాప్సీ ఇప్పుడు హిందీలో స్టార్ హీరోయిన్. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌తో క్రేజీ స్టార్డమ్ సంపాదించుకుంది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ మాత్రం సౌత్ నుంచే ప్రారంభమైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఝుమ్మంది నాదం' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే బాలీవుడ్‌కి వెళ్లాక ఒక ఇంటర్వ్యూలో సౌత్ మేకర్స్ గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. సౌత్ సినిమాల్లో నడుము చూపించడం గురించి, రాఘవేంద్ర రావు దర్శకత్వంపైనా కామెంట్స్ చేసింది. అయితే ఆ మాటలు బ్యాక్ ఫైర్ కావడంతో తాప్సీ మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను పాజిటివ్‌గా చెప్తే జనాలు నెగటివ్‌గా అర్థం చేసుకున్నారని చెప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
పూజా హెగ్డే తెలుగునాట మూడు కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. టాప్ హీరోయిన్ అనే బోనస్ ఇమేజ్ కూడా ఉంది. అయితే పూజా హెగ్డే ఒకసారి హిందీ మీడియాతో సౌత్ సినిమాల్లో హీరోయిన్ ప్రజంటేషన్ గురించి కామెంట్ చేసింది. సౌత్ వాళ్లకి బెల్లీ ఎక్స్‌పోజింగ్ అంటే పిచ్చి అని, అది ఎందుకో తెలియదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో పూజా మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పూజా హెగ్డే స్టేట్ మెంట్ పై మరో స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆ గొడవ కొంచెం తగ్గింది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలతో టాప్ లీగ్‌లో దూకుడు చూపిస్తోంది. మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తోంది.