విడుదలై నెల రోజులు గడిచిన కానీ థియేటర్లలో కేజీఎఫ్ 2 హావా మాత్రం ఆశలు తగ్గడం లేదు.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించి చాలా అద్భుతంగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాపై స్పందించారు హీరో సిద్ధార్త్. తన తదుపరి సినిమా ఎస్కేప్ లైవ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా  ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ కేజీఎఫ్ 2 సినిమాని భారతీయ సినిమా అని పిలవాలంటూ చెప్పుకొచ్చారు.కరోనా వైరస్ మహామ్మారి కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడిన కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలైన బాక్సాఫీస్‏ను బాగా షేక్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా అత్యథిక వసూళ్లు సాధించి రూ. 1200 కోట్ల క్లబ్‏లో చేరింది. తాజాగా ఇంటర్వ్యూలో… పాన్ ఇండియా అంటే చాలా ఫన్నీగా ఉందని.. అలా పిలుస్తున్నప్పుడు చాలా అగౌరవంగా అనిపిస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఇంకా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ” నాకు చాలా చాలా ఫన్నీగా అనిపిస్తోంది.. నేను 15 సంవత్సరాలకుపైగా పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాను.. నా గొంతుతోనే ఇప్పటి దాకా మాట్లాడాను.. నాకు ఎవరు కూడా డబ్బింగ్ చెప్పలేదు.. తమిళంలో తమిళుడిగా ఇంకా తెలుగులో అచ్చమైన తెలుగు కుర్రాడిగా.. హిందీలో భగత్ సింగ్ లా కూడా నేను మాట్లాడుతాను. అందుకే నాకు పాన్ ఇండియా అంటే చాలా అగౌవరంగా అనిపిస్తుంది..అందుకు బదులుగా భారతీయ సినిమా అని పిలవాలని నేను కోరుకుంటున్నానను.. ఇక ఈ మాటలు ఎవరినో ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. హిందీ సినిమాలకు ప్రాధాన్యతను ఇస్తారు.. అవి సూపర్ హిట్ అయితే బాలీవుడ్ సినిమా అని మాత్రమే వారు అంటారు.. కానీ ప్రాంతీయ సినిమాలు ప్రేక్షకులను ఆదరించినప్పటికీ వాటిని ఎందుకు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు.. భారతీయ సినిమా అని అనొచ్చు కదా.. ఇక కేజీఎఫ్ సినిమా ప్రయాణాన్ని గౌరవించండి.. ఆ సినిమాని కన్నడ సినిమా అని పిలవండి. ఇక ఆ సినిమాను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను దృష్టిలో ఉంచుకునైనా దాన్ని ఇండియన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అందుకే ఇక పాన్ ఇండియా కాదు.. భారతీయ సినిమా అని అనండి.. పాన్ అనే పదం నాకు అసలు అర్థం కావడం లేదు..చాలా తమాషాగా అనిపిస్తుంది. ” అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: