పవన్
కళ్యాణ్ తో
సినిమా చేస్తే తప్పకుండా దర్శకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయనతో
సినిమా చేయాలంటే చాలా మంది దర్శకులు వెనకడుగు వేస్తున్నారు. స్టార్ దర్శకులు సంగతి పక్కన పెడితే మీడియం రేంజ్ దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఆయన తో సినిమాలు చేసిన దర్శకులకు మంచి అవకాశాలు ఉండకపోవడమే. పవన్
కళ్యాణ్ సినిమాలు చేసినా చాలా మంది దర్శకులు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు.
తాజాగా పవన్
కళ్యాణ్ తో చేసిన దర్శకుడైన సాగర్ చంద్ర కూడా ఖాళీగా ఉండటం టాలీవుడ్లో ఈ విధమైన సెంటిమెంట్ ఎక్కువైపోతుంది అని చెప్పవచ్చు. భీమ్లా
నాయక్ సినిమాను పవన్
కళ్యాణ్ చేసిన విషయం తెలిసిందే. పోయిన ఏడాది విడుదలైన ఈ
సినిమా ఘన విజయం సాధించింది.
త్రివిక్రమ్ మాటలు అందించగా సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. ఒక
డైరెక్టర్ అన్న పేరు తప్ప అన్ని పనుల్లోనూ
త్రివిక్రమ్ హ్యాండ్ ఉందని చెప్పాలి. అదే కాదు అన్ని విషయలలోనూ
త్రివిక్రమ్ వేలు పెట్టాడు అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.
ఆ విధంగా ఈ ప్రాజెక్టుకు తెరవెనుక ఉండి నడిపించింది త్రివిక్రమే. అయితే ఈ
సినిమా సక్సెస్ పూర్తి క్రెడిట్ కూడా అయినకే దక్కింది. దానికి కారణం ఏదైనా దర్శకుడికి కొంత అయినా క్రెడిట్ దక్కకపోవడం అనేది నిజంగా ఎంతో బాధాకరమైన విషయం అని అంటున్నారు. ఏ సినిమాకైనా దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. అలాంటి దర్శకుడికి కనీసం క్రెడిట్ కూడా దక్కకపోతే దర్శకుడు గా ఉండడం ఎందుకని కొంతమంది దర్శకులు వారి సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అందుకే ఈ నేపథ్యంలో పవన్
కళ్యాణ్ తో
సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఎప్పుడు ఆగిపోతాయో తెలియనీ పరిస్థితులలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో పవన్ ఏ విధంగా సినిమాలను చేస్తాడో చూడాలి.