సుఖేష్ చంద్రశేఖర్ కేసు తర్వాత జాక్వెలిన్‌కి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. డియరెస్ట్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ కూడా జాక్వెలిన్‌కి అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక క్రిష్ అయితే 'హరిహర వీరమల్లు' నుంచి జాక్వెలిన్‌ని తప్పించి, నర్గీస్ ఫక్రీని తీసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీ కూడా జాక్వెలిన్‌ని పక్కనపెడుతోంది. దీంతో ఈ శ్రీలంకన్ బ్యూటీ కెరీర్‌కి బ్రేకులు పడుతున్నాయని తెలుస్తోంది.
'రామ్ తేరి గంగా మైలీ' టైమ్‌లో మందాకినికి బోల్డంత పాపులారిటీ వచ్చింది. ఎయిటీస్, నైంటీస్‌లో యూత్‌కి నిద్ర లేకుండా చేసింది. అయితే మాఫియా దాన్ దావుద్ ఇబ్రహీంతో స్నేహం మొదలయ్యాక బాలీవుడ్‌కి దూరమైంది మందాకిని. దుబాయ్‌కి వెళ్లిపోయాక సినిమాలు పక్కనపెట్టేసింది. అయితే బాంబ్ బ్లాస్ట్ కేసులో దావుద్‌కి లింక్ ఉందని వార్తలు రాగానే అతనితో విడిపోయింది. తర్వాత కగ్యుర్ రిన్‌పోచ్ ఠాకూర్‌ని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయింది మందాకిని. మందాకిని మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. సపోర్టింగ్ రోల్స్‌తో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొడుకు రాబిల్ ఠాకూర్‌ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తుందనే టాక్ వస్తోంది. రాబిల్‌ని హీరోగా లాంచ్ చేయడానికి ఇండస్ట్రీ పరిచయాలన్నిటిని బయటకు తీస్తోందట మందాకిని.
సినిమాల్లో వైలెన్స్‌కి హీరోయిజం ఉండొచ్చు. నేరాల కథలతో 'కెజిఎఫ్' లాంటి హిట్స్ రావచ్చు. కానీ నేరగాళ్ల నీడతో సావాసం చేసినా, కెరీర్ కష్టాల్లో పడుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లా చాలామంది హీరోయిన్లు, ఈ క్రైమ్ కాంటాక్స్‌తోనే కష్టాల్లో పడ్డారు. కెరీర్ కూడా పోగొట్టుకున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలాగైతే సుఖేష్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఏం తెలియదని చెప్పినట్లే, మోనికా బేడి కూడా అబూ సలీమ్ నేరప్రపంచం గురించి తెలుసుకోకుండా ప్రేమలో పడింది. ఆ తర్వాత పాస్‌పోర్ట్ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయ్యి, కెరీర్ కూడా పోగొట్టుకుంది. అబూ సలీమ్ జైల్‌లో ఉంటే, మోనికా బేడి ఇంకా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఫైట్ చేస్తోంది.