అజయ్ దేవగణ్, సుదీప్‌ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో నడిచిన  ముగిసి కొన్ని గంటలయ్యిందో లేదో అప్పుడే మరో గొడవ మొదలైంది. బాలీవుడ్‌ హీరోలు సౌత్‌ స్టార్స్‌ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. పాన్‌ మసాలా యాడ్‌ని బేస్‌ చేసుకుని బాలీవుడ్‌ స్టార్స్‌ని విమర్శిస్తున్నారు నెటిజన్లు. యశ్‌కి 'కెజిఎఫ్‌'తో ఇండియా వైడ్‌గా మంచి గుర్తింపు వచ్చింది. యాక్షన్‌ స్టార్ అనే ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. యూత్‌లో సూపర్‌స్టార్‌గా మారాడు. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి మల్టీనేషనల్‌ కంపెనీలు రంగంలోకి దిగాయి. బ్రాండ్‌ అంబాసిడరింగ్‌ చేయమని భారీగా ఆఫర్ చేశారట. వాటిల్లో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా కంపెనీలు కూడా ఉన్నాయట.

యశ్‌ని ఇటీవల బ్రాండ్‌ అంబాసిడరింగ్ చేయాలని పొగాకు ఉత్పత్తులకు చెందిన పాన్‌ మసాలా కంపెనీ కాంటాక్ట్ చేసిందట. భారీ పే చెక్‌ కూడా ఆఫర్ చేసిందట. అయితే యశ్‌ మాత్రం ఈ డీల్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు మసాలాని ప్రమోట్ చేసి తన అభిమానులని తప్పుదోవ పట్టించలేనని చెప్పాడట.  

ఇక అక్షయ్‌ కుమార్‌ పబ్లిక్‌గా పొగాకు ఉత్పత్తులని ప్రమోట్ చేయనని చెప్పాడు. కానీ భారీగా చార్జ్‌ చేసి ఒక పాన్‌ మసాలా యాడ్‌లో నటించాడు. ఇక ఆ యాడ్‌ బయటకు రావడం ఆలస్యం పాత వీడియోని బయటకు తీసి అక్షయ్‌ని ఘోరంగా ట్రోల్‌ చేశారు నెటిజన్లు. దీంతో అక్షయ్ నన్ను క్షమించండి.. పాన్‌ మసాలా యాడ్‌తో వచ్చిన డబ్బులని చారిటీకి ఉపయోగిస్తానని ప్రకటించాడు.  అక్షయ్‌ కుమార్‌ని విమర్శల్లో పడేసిన పాన్ మసాలా యాడ్‌లోనే అజయ్‌ దేవగణ్‌, షారుఖ్ ఖాన్‌ కూడా నటించారు. ముగ్గురూ కలిసి జుబాన్ కేసరి అంటూ పొగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ని ఘోరంగా కామెంట్‌ చేశారు. సౌత్‌ ఇండియన్‌ స్టార్లు ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్‌ చేస్తోంటే, మీరు మాత్రం పాన్‌ మసాలా ఇండియన్ స్టార్స్‌ అని విమర్శించారు.

సినిమా హీరోలు సామాజిక సేవ చేయాలని ఎవరూ ఎదురుచూడట్లేదు, కానీ వాళ్లని ఆరాధించే అభిమానులని మాత్రం తప్పుదోవ పట్టించొద్దు. ఆల్కహాల్, గుట్కా, సిగరెట్లని ఫ్యాషన్‌ సింబల్‌గా మార్చి వాళ్ల ఆరోగ్యాన్ని నాశనం చేయొద్దని సోషల్‌ వర్కర్స్‌ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ గొడవల తర్వాత అయినా స్టార్స్‌లో మార్పు వస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: