సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సూపర్ హిట్ కొట్టేసింది. రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చినా మహేష్ మేనియా ముందు ఆ టాక్ నిలబడలేకపోయింది. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర మహేష్ స్టామినా తెలుస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. స్టార్ సినిమా థియేట్రికల్ రన్ మాత్రమే కాదు డిజిటల్ రన్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంటాయి. ఈ క్రమంలో సర్కారు వారి పాట ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.

మహేష్ సర్కారు వారి పాట సినిమా ను అమేజాన్ ప్రైం కొనేసింది. భారీ మొత్తంగా అమేజాన్ మహేష్ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. సర్కారు వారి పాట సినిమా అమేజాన్ ప్రైం లో జూన్ 10 లేదా 24 తేదీల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ 10న రిలీజ్ అయితే మాత్రం నెల రోజుల్లోనే సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సర్కారు వారి పాట సక్సెస్ మహేష్ స్టామినా ఏంటన్నది మరోసారి తెలిసేలా చేసింది.

సినిమా తర్వాత మహేష్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అర్జునుడు టైటిల్ పరిశీలనలో ఉంది. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ రా ఏజెంట్ గా కనిపిస్తారని టాక్. ఈ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమా లో మహేష్, పూజా హెగ్దే జత కట్టింది. త్రివిక్రం సినిమాను త్వరగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాని 2023 స్టార్టింగ్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: