కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపనుంది. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ .. ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రమోద్ తివారి, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ పథాక్ లకు అవకాశం కల్పించారు. ఇక వీటితోపాటుగా రాజీవ్ శుక్లా చత్తీస్ ఘడ్ మాజీ ఎంపీపీ పుష్ప యాదవ్ సతీమణి రంజిత్.. తదితరులు సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్నారు..అయితే ఈ ఎంపిక కొంతమంది సీనియర్ నేతలను చాలా అసంతృప్తికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.
రాజ్యసభ సీటు ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధినేత అయినటువంటి ప్రతినిధి పవన్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని తెలియజేశారు. నా తపస్సును ఏదైనా గాయం తగిలి ఉంటుందేమో అన్నట్టుగా ట్వీట్ చేశారు. పవన్ ఖేరా ట్వీట్ కు నగ్మా స్పందిస్తూ.. నా పద్దెనిమిదేళ్ల తపస్సుకి కూడా ఇమ్రాన్ ఖాన్ ముందు తక్కువైంది అంటూ పార్టీపై విమర్శలు గుప్పించింది.. 2003-04 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను రాజ్యసభకు పంపుతానని తెలియజేసిందని.. అప్పటి నుంచి ఈ 18 ఏళ్ల లో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం కల్పించలేదని ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ని ఎంపిక చేయడం ఆ పదవికి నేను కూడా తక్కువ అర్హురాలినేనా అంటూ నగ్మా ప్రశ్నిస్తోంది.