అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మలయాళం 'ప్రేమమ్' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో 'అ ఆ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తన అందమైన నటనతో, అంతే అందమైన అందచందాలతో కుర్రకారు మనసు దోచుకోవడానికి మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.

ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అనుపమ పరమేశ్వరన్ 'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజిస్ , కార్తికేయ 2 రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ ప్రేమ గురించి పెళ్లి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

అనుపమ పరమేశ్వరన్ ప్రేమ గురించి మాట్లాడుతూ...  నాకు లవ్ మ్యారేజ్ లపై చాలా మంచి అభిప్రాయం ఉంది. లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న జంటలను చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. నా పేరెంట్స్ కు కూడా ఆ విషయాన్ని చెప్పేశాను. ఇక నా ప్రేమ విషయానికి వస్తే... నా రిలేషన్ షిప్ గురించి నాకు పెద్దగా క్లారిటీ లేదు. నేను మాత్రం ప్రస్తుతం వన్ సైడ్ లవ్ లో ఉన్నాను. మరి అటు సైడ్ నుంచి ఏమి అనుకుంటున్నారో నాకు ఏ మాత్రం తెలియదు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం నాది వన్ సైడ్ లవ్. ఇలా అనుపమ పరమేశ్వరన్ పెళ్లి గురించి వివాహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: