ఈమూవీ చివరిన వచ్చే ఉద్వేగ పూరితమైన సన్నివేశాలకు ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకులు లేచి నుంచుని మేజర్ సందీప్ త్యాగానికి ఉద్వేగానికి లోనై చప్పట్లు కొడుతున్నారు అంటే ఈమూవీ సూపర్ హిట్ అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈమూవీని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు.
ఈమూవీకి సంబంధించి జరుగుతున్న ప్రమోషన్ లో అడవి శేషు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈమూవీలోని సందేప్ పాత్రలో నటించిన తరువాత తనలోని స్వార్థం బాగా తగ్గిపోయిందని అంతేకాకుండా తమ కన్నకొడుకును పోగొట్టుకున్న మేజర్ సందీప్ తల్లితండ్రులకు తాను రెండవ కొడుకుగా తన జీవితాంతం వారికి అండగా ఉంటానని కామెంట్ చేసాడు. అంతేకాదు సందీప్ జీవితంలో ఉన్న కీలక ఘట్టాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయకుండా వాస్తవంగా నిజాయితీతో ఈమూవీని తాము తీసాము అని అడవి శేషు అంటున్నాడు.
స్వతహాగా రచయిత అయిన అడవి శేషు ఈమూవీలోని సంభాషణల విషయంలో ప్రతి సంభాషణలోను ఉద్వేగాన్ని రగిలించే విధంగా సంభాషణలు బాగా వ్రాసాడు. అంతేకాదు ఈ మూవీకి స్క్రీన్ ప్లే చాల బాగా వచ్చింది అంటున్నారు. రేవతి ప్రకాష్ రాజ్ అడవి శేషుల మధ్య వచ్చే ఉద్వేగపూరితమైన సీన్స్ ఈ మూవీకి హైలెట్. అయితే ఈ మూవీతో పోటీగా వస్తున్న కమలహాసన్ విక్రమ్ అక్షయ్ కుమార్ ‘పృధ్వీరాజ్’ లపై కూడ భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ పోటీని తట్టుకుని ఎంతవరకు ఈమూవీ బయ్యర్లకు లాభాలను తెచ్చిపెడుతుంది అన్న విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తూ ఉండటంతో ఈమూవీ రిజల్ట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు..