యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మార్చి నెలాఖరులో విడుదలై అన్ని ప్రాంతాల్లో కూడా విశేషమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది .
ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేతదానయ్య . కీరవాణి సంగీతం అందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా అటు విదేశాల్లో కూడా విపరీతమైన రెస్పాన్స్ తో పాటు కలెక్షన్ ని కూడా సొంతం చేసుకోవడం విశేషం. దర్శకుడు రాజమౌళి, ఎంతో అద్భుతంగా విజువల్ వండర్ గా ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించి మరొక్కసారి సక్సెస్ అయ్యారు. ఓవరాల్ గా రూ. 1100 కోట్ల పైచిలుకు కలెక్షన్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇటీవల ఓటిటి లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అయితే విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ మూవీ అటు ఓటిటి లో కూడా దుమ్మురేపుతున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఇతర దేశాల ఆడియన్స్ సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఓటిటి వర్షన్ కి బ్రహ్మరథం పడుతున్నారని, వ్యూస్ పరంగా కొన్ని దేశాల్లో ఆర్ఆర్ఆర్ టాప్ స్థానములో నిలవగా ఇటు మన దేశంలో కూడా విడుదలైన ఓటిటిలో భారీ స్థాయిలో వ్యూస్ రాబట్టినట్లు టాక్. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ మొన్న అటు థియేటర్స్ లో ఇపుడు ఇటు ఓటిటి లో తన వీర విధ్వంసాన్ని చూపిస్తోందని, ఆ విధంగా ఈ మూవీ ఆడియన్స్ కి ఎంతో బాగా కనెక్ట్ అయిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.