
ప్రముఖ హాలీవుడ్ నటుడు అయిన జానీ డెప్ తన మాజీ భార్ నటి అయిన అంబర్ హర్డ్‌పై కోర్టు లో పరువు నష్టం దావా వేశారు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేశారు నటుడు జాని డెప్. అయితే అప్పటి నుండి కోర్టులో కేసు నడుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసిన కథనానికి రియక్ట్ అయిన జాని అందుకు వ్యతిరేకంగా కోర్టు లో దావా వేశారు. కాగ ఈ కేసుకు సంబంధించి బుదవారం జూన్ 1 న తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో డెప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. వర్జీనియాలోని ధర్మాసనం జానీ డెప్‌కు 15 మిలియన్ డాలర్ల (రూ.1,16,33,46,750) నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
తాజా తీర్పు జానీకి అనుకూలంగా రావడంతో సంతోషంతో తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు జాని ...కోర్టు నా జీవితాన్ని తిరిగి ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం తో అంబర్ హర్డ్ నిరాశ వ్యక్తం చేయగా జాని తన ఆనందాన్ని తెలిపారు. డెప్, హర్డ్ 2011లో 'ది రమ్ డైరీ' అనే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి 2015 లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైనా రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. మే 2016లో హర్డ్.. డెప్ గృహ హింసకు పాల్పడ్డాడని అంతే కాకుండా డెప్ బలవంతంగా సెక్స్, డ్రగ్స్ వంటి వాటిని వినియోగించారు అని అప్పట్లో కేసు వేశారు హార్డ్. అలా వీరు చట్టపరంగా విడిపోయారు.