ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫైనల్ ఎపిసోడ్స్ కి చేరుకుంది. షోలో పాల్గొన్న సింగర్స్ లో టాప్ 6 మెంబర్స్ ని ఫైనల్ చేశారు. ఇక ఈ టాప్ 6 మధ్య హోరా హోరీగా పోటీ జరుగనుంది. ఇక షో ఆడియెన్స్ కి మరింత ఆసక్తి పెరిగేలా లేటెస్ట్ గా నందమూరి నట సింహం బాలయ్య బాబుని గెస్ట్ గా తీసుకొచ్చారు. ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో తో సూపర్ సక్సెస్ అందుకున్న బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి రెడీ అవుతున్నారు.

ఆహాతో ఉన్న ఆ రిలేషన్ కొద్దీ అందులో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కి గెస్ట్ గా వచ్చారు. వస్తూ వస్తూనే క్యాజువల్ గా రాలే.. కాంపిటీషన్ కి వచ్చానని అన్నారు. అంతేకాదు టాప్ 6 సింగర్స్ కి బాలయ్య తన తరపున సర్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. షోలో బాలకృష్ణ వస్తే ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి చూపించబోతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో బాలకృష్ణ తన ఎనర్జీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇలా ఆహాలో బాలయ్య కనిపించి ఇండియన్ ఐడల్ షో కి క్రేజ్ వచ్చేలా చేశారు.

ఆహా కోసం బాలకృష్ణ ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ఆయన ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. అన్ స్టాపబుల్ షోతోనే ఆడియెన్స్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే దానికి ముందే శాంపిల్ గా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో గెస్ట్ గా వచ్చి అలరించారు. భం అఖండ.. నందమూరి నాయకా సాంగ్ లు సింగర్స్ పాడటంతో బాలయ్య బాబు ఊగిపోయారని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: