ఖైదీ, మాస్టర్ సినిమాలతో డైరక్టర్ గా తన సత్తా చాటిన లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో కమల్ హాసన్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా విక్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కమల్ హాసన్ నుండి నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా విక్రం. విశ్వరూపం 2 సినిమా తర్వాత కమల్ నుండి ఈ సినిమా రావడం విశేషం. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కథని లోకేష్ కనగరాజ్ బాగా డీల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా సాగగా.. సెకండ్ హాఫ్ మాత్రం గ్రిప్పింగ్ గా నడిపించాడు.

విక్రం సినిమాలో కమల్ హాసన్ కర్ణన్ పాత్రలో నటించగా డ్రగ్ మాఫియా డీలర్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా అమర్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించారు. ఇక సినిమా క్లైమాక్స్ లో సూర్య కనిపించి అదరగొట్టాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాతో పాటుగా 1987 లో వచ్చిన విక్రం సినిమాకు ఈ సినిమాకు లింక్ ఉంటుంది. సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. చాలారోజుల తర్వాత కమల్ హాసన్ తన యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించారని చెప్పొచ్చు. సినిమాకు తమిళంతో పాటుగా తెలుగులో కూడా భారీ రిలీజ్ చేశారు. విక్రం సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ఫ్యాన్స్ కూడా కమల్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే విక్రం సినిమా వచ్చిందని చెప్పొచ్చు. ఓ పక్క అడివి శేష్ మేజర్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రాగా విక్రం కూడా అదరగొట్టేలా ఉందని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: