పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్, అలానే భీమ్లా నాయక్ సినిమాలతో రెండు విజయాలు సొంతం చేసుకుని కెరీర్ పరంగా మంచి జోష్ తో ముందుకు సాగుతున్నారు.ఇక ఆయనతో లేటెస్ట్ గా క్రిష్ జాగర్లమూడి తీస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుందాయే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడికల్ డ్రామా మూవీ గా ఎంతో భారీ హంగులతో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పై పవన్ ఫ్యాన్స్ అయితే మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో వీరమల్లు పాత్ర చేస్తున్న పవన్, ఆ పాత్ర కోసం శారీరకంగా ఎంతో కష్టపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికోసం పలు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్న పవన్, కొంత తన మేకోవర్ మార్చడం పాటు స్లిమ్ గా కూడా మారారు.
అయితే విషయం ఏమిటంటే, మరోవైపు తన జనసేన పార్టీ తరపున కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, నిన్న మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సమయంలో ఆయన లుక్ చూసిన పలువురు మీడియా వారు, అలానే ప్రేక్షకాభిమానులు ఒకింత థ్రిల్ అయ్యారు. కోర మీసాలతో పూర్తిగా క్రాఫ్ పెంచిన పవన్ అదిరిపోయే ఆ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా హరిహర వీరమల్లు గొప్ప విజయం అందుకోవడం, తమ హీరో కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం కనపడుతోంది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: