ప్రస్తుతం 'సలార్' సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా వర్రీ అవుతున్నారని, వెయిట్ తగ్గితే తప్ప లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనని ఖరాఖండీగా చెప్పారని,...అంతేకాదు  ప్రభాస్‌కు వెయిట్ తగ్గమని కండిషన్లు పెట్టారని సదరు వార్త సారాంశం.ఇకపోతే అటువంటి వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు.కాగా సలార్' సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఆ సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ప్రభాస్ కౌగిలించుకున్న ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే 'సలార్' షూటింగ్ 30- 35 శాతం కంప్లీట్ అయ్యింది. ఇకపోతే ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అన్నట్టు... ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఇక బర్త్ డేకి ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు. కాగా సెట్స్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.అంతేకాదు ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది..ఇక  ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. అంతేకాదు 'కె.జి.యఫ్ 2'ను నిర్మించినది ఆయనే. అయితే జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే  'సలార్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు 'కె.జి.యఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ పాల్గొన్నారు.ఇక సలార్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ఈ కన్నడ దర్శకుడు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి అసుర అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: